హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ సమరభేరి

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు 'బాకీ కార్డుల' కార్యక్రమం నిర్వహించనున్నారు. జడ్చర్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆగస్టు 31న ఉదయం 10 గంటలకు ప్రేమ్ రంగా గార్డెన్స్‌లో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరగనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.