SRD: కంగ్టిలో మీసేవ కేంద్రం నిర్వాహకుడు సైబర్ బురిడీ నుంచి తప్పించుకున్నాడు. ఓ వ్యక్తి తాను కంగ్టి PS నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని, వెంటనే నగదు అవసరమని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారించగా మోసం వెలుగులోకి వచ్చిందని సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
కంగ్టిలో సైబర్ మోసగాడి బురిడీ


