హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు ప్రమాదాలను నివారించాలి'

SRD: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని నందమూరి దీపిక జానకిరామ్ సూచించారు. శనివారం పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'డ్రైవ్‌ సేఫ్‌' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే బాధ తనకు తెలుసని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.