హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశుధ్య పనులు చేపట్టండి'

MNCL: మంచిర్యాల బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖదీమ్ కబ్రస్తాన్‌లో పారిశుధ్య పనులు చేపట్టాలని శనివారం ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇబ్నీ అఫాన్ మాట్లాడుతూ.. పిచ్చి మొక్కలు, పొదలు పెరిగి రాత్రి వేళ మృతదేహాలను ఖననం చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు.