హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన

NZB: జిల్లాలో నీట్‌(పీ.జీ) పరీక్షకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో 265 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అర్సపల్లిలోని ఏవీ ఎంటర్‌ప్రైజెస్‌, మల్లారంలోని షిఫ్ట్‌ టెక్నాలజీస్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.