హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో టాస్ డైరెక్టర్ తనిఖీ

KNR: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ ఎంపీపీఎస్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కే.లింగయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణను తనిఖీ చేసి విద్యా ప్రమాణాల పెంపునకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధిపై సిబ్బందితో చర్చించారు.