కృష్ణా: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. పోరంకి సమీపంలో బ్రేకులు ఫెయిలైన ఆర్టీసీ బస్సు రివర్స్‌లోకి వచ్చి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అయితే ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు


