హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల పురపాలక సంఘానికి 75 ఏళ్ల..!

బాపట్ల పురపాలక సంఘం ప్లాటినం జూబ్లీ ఉత్సవాల లోగోను ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ శనివారం ఆవిష్కరించారు. త్వరలో వేడుకలు జరిపి, పట్టణాన్ని స్వచ్ఛ, సుందర బాపట్లగా అభివృద్ధి చేస్తామన్నారు. 1951లో మున్సిపాలిటీగా మారిన బాపట్ల తొలి చైర్మన్ వెలగపూడి సుబ్బారావు విగ్రహం, 1954నాటి విజయ స్థూపాన్ని పునరుద్ధరించినట్లు ఫోరం బెటర్ బాపట్ల కార్యదర్శి తెలిపారు.