హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్యలకు నిలయంగా చించినాడ వంతెన

కోనసీమ: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ గోదావరి నదిపై 2001లో ప్రారంభించిన చించినాడ బ్రిడ్జి ఇప్పుడు ఆత్మహత్యల వారధిగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బ్రిడ్జిపై నిత్యం కొన్ని వేల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. కొందరు క్షణికావేశంలో బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్రిడ్జిపై ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.