W.G: నరసాపురం మండలం చిట్టవరంలో జై భీమ్ యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు శనివారం రూ.47,260 ఆర్థిక సహాయం అందించారు. ముగ్గురు చిన్నారుల పేర్లపై ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. కిరాణా సరుకులు, కూరగాయలు కూడా అందజేశారు. కార్యక్రమంలో గెడ్డం సునీల్ గవాస్కర్, రాయపూడి భవాని ప్రసాద్, బుంగ రాజు, సుమలత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనాథ పిల్లలకు అండగా జై భీమ్ యువసేన


