హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద

KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. శనివారం ఎగువ నుంచి 11,574 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం డ్యాంలో 1,630.62 అడుగులకు గాను 96.42 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. దిగువన ఉన్న వివిధ కాల్వలకు 8,905 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.