హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట ఛైర్మన్ అభ్యర్థిత్వంపై వినతి

అన్నమయ్య: రాబోయే రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ప్రముఖ డెంటిస్ట్, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ సీఎం చంద్రబాబును కోరారు. శనివారం విజయవాడలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.