ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో మేజర్ డ్రైనేజీ పరిస్థితి అధ్వానంగా మారింది. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీ నిండిపోయి మురుగునీరు వెళ్లే దారి లేకుండా మూసుకుపోయింది. దీంతో దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీని శుభ్రం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చెత్తతో నిండిన డ్రైనేజీ.. ప్రజల ఆందోళన


