బాపట్లలోని విజయలక్ష్మీపురం చర్చ్ బజార్ సమీపంలో కోతుల బెడద తీవ్రమవ్వడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గృహాల వద్ద కోతుల గుంపులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక అధికారులు వెంటనే స్పందించి, కొండముచ్చుల సహాయంతో కోతుల బెడద నుంచి తమకు ఉపశమనం కలిగించాలని ఆ ప్రాంతం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోతుల బెడదతో విజయలక్ష్మీపురం ప్రజల ఆందోళన


