హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి

సత్యసాయి: రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి స్పష్టమవుతోందని మంత్రి సవిత తెలిపారు. రెండేళ్లలో హంద్రీ-నీవా ద్వారా 50 టీఎంసీలకు పైగా నీటిని తరలించి 420 చెరువులు నింపామన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రాజెక్టులకు రూ.6,600 కోట్లు కేటాయించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.