AKP: ఎలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎన్.ఎల్.డి. భవాని అధ్యక్షతన విద్యార్థులకు పాటలు, పద్యాల పోటీలు నిర్వహించడంతో పాటు స్కిట్లు, నృత్య ప్రదర్శనలు చేపట్టారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి'


