హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాయకరావు పేటను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'

AKP: పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 2న పాయకరావు పేట వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి హోం మంత్రి వంగలపూడి అనిత ఈ సమస్యను తీసుకువెళ్లి కరువు ప్రాంతంగా ప్రకటింప చేయాలని కోరారు. పశువులకు సబ్సిడీపై పశుగ్రాసం సరఫరా చేయాలన్నారు.