హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు కోసం మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర

MDK: నందగోకుల్—చల్మెడ గ్రామాల మధ్య తీవ్రంగా దెబ్బతిన్న రహదారిని తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. నందగోకుల్‌లో మహిళలు నీరాజనాలు పలకగా, 16 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా రోడ్డు నిధులు సాధిస్తామని ఆమె హామీ ఇచ్చారు.