హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరంలో పెద్దపులి సంచారం.. అప్రమత్తం

ELR: పోలవరం మండల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఖాళీ ముంపు ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి అభయారణ్యం వైపు కదులుతున్నట్లు రేడియో కాలర్‌ సిగ్నళ్ల ఆధారంగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.