హైదరాబాద్: 28°C
క్రీడలు

విద్యార్థి చదువుకు వైభవ్ ఆర్థిక సాయం!

టీమిండియా బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విద్యార్థి చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదువుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన విద్యార్థులు తనను సంప్రదించాలని కోరాడు. నిజంగా అవసరం ఉన్నవారే సంప్రదించాలని విజ్ఞప్తి చేశాడు. విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.