హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

KMR: సదశివ నగర్ మండలంలోని వజ్జపల్లిలో లబ్ధిదారులకు శనివారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. గ్రామంలో మొత్తం 602 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధాబాయి శ్యామ్‌రావు, ఉపసర్పంచ్ కయ్యాల నర్సింలు పాలుగోన్నారు.