హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్రీ గార్డులు లేక మొక్కలకు ముప్పు

WNP: జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం వెనుక రోడ్డుకు ఇరువైపులా వనమహోత్సవంలో నాటిన మొక్కలకు నీరు పోస్తున్నా.. ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో మేకలు, పశువులు మొక్కలను తినే అవకాశం ఉందన్నారు. మొక్కల సంరక్షణకు వెంటనే ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, లేకుంటే వనమహోత్సవం లక్ష్యం నెరవేరదని కోరారు.