కోనసీమ: ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని ఆలయ EO దుర్గాభవాని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులంతా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సాంప్రదాయ వస్త్రధారణలో వస్తేనే గుడిలోకి ఎంట్రీ


