హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి పొడవునా చెత్తకుప్పలే'

PPM: సాలూరు పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీగిరాం వెళ్లే రహదారి చెత్తకుప్పలతో నిండిపోయింది. వ్యాపారులు, స్థానికులు కొబ్బరి బొండాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్తను రోడ్డుపక్కనే వేయడంతో రోజురోజుకూ కుప్పలు పెరుగుతున్నాయి. దుర్వాసనతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలిని స్థానికులు కోరుతున్నారు.