KKD: పిఠాపురం మండలం పి. దొంతమూరులో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాలింకి వీరబాబు ఇల్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధిత దంపతులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం


