హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ నిర్ణయంపై స్టీవ్ వా ఫైర్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఐసీసీపై తీవ్ర విమర్శలు చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యను 14 నుంచి 12కు తగ్గించడం వెనుకబడిన చర్యగా అభివర్ణించారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలంటే మరిన్ని జట్లకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ఫిఫా ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య పెంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ నిర్ణయం అర్థం కావడం లేదన్నారు.