హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

VZM: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ సీతం కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కామన్వెల్త్ క్రీడల్లో రజత పతక విజేత అజయ్ బాబు, ఆయన తండ్రి శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.