CTR: పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవారిని భక్తులు దర్శించుకోగా.. మహిళలు భక్తిశ్రద్ధలతో పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయానికి పోటెత్తిన భక్తులు


