అన్నమయ్య: చిన్నమండెం మండలం వండాడి వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వేకోడూరు నియోజకవర్గం అంకమ్మనగర్‌కు చెందిన పత్తి సుధాకర్ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


