NTR: జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో షేర్ మహమ్మద్ పేట, రామచంద్రునిపేట గ్రామాల ప్రజలు కెమికల్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు. కంపెనీల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
దుర్వాసనతో అనారోగ్యం.. కంపెనీపై ఫిర్యాదు


