హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన సెయింట్‌ ఆన్స్‌ సిస్టర్స్

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఆర్‌సీఎం చర్చికి చెందిన సెయింట్‌ ఆన్స్‌ సిస్టర్స్ ఎమ్మెల్యే రాజగోపాల్‌కు రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. రాఖీ పండుగ ప్రేమానురాగాలకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.