హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహిత అనుమానాస్పద మృతి

కృష్ణా: పెడనలో వివాహిత రాజి (22) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. చోడిదిక్కుల ప్రాంతానికి చెందిన రాజికి గూడూరు మండలం శురదాయపేటకు చెందిన వినయ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పండగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వచ్చిన ఆమె బలవన్మరణానికి పాల్పడింది.