అన్నమయ్య: జిల్లాలో ఆగస్టు 30న మదనపల్లె, రాయచోటిలో నిర్వహించే నీట్–పీజీ పరీక్షకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఉదయం 8.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. కేంద్రాల పరిధిలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమల్లో ఉంటుందని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీట్–పీజీ పరీక్షకు భారీ బందోబస్తు


