హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8 వారాలైనా జమకాని వేతనాలు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి విబిజి రాంజీ పనులు ప్రారంభమయ్యాయి. 8 వారాలు గడుస్తున్నా కూలి డబ్బులు జమ కాలేదని కూలీలు వాపోతున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో పేద కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.