హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్లకు రాఖీలు కట్టిన బాలికలు

PPM: వీరఘట్టం కత్తులకవిటి జడ్పీ ఉన్నత పాఠశాల ఎకో క్లబ్ బాలికలు స్వయంగా తయారు చేసిన రాఖీలను పాఠశాల ఆవరణలోని చెట్లకు కట్టి పర్యావరణ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. వనరుల పొదుపు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు హెచ్‌ఎం పి. సుధారాణి తెలిపారు.