PPM: పాచిపెంట మండలం పి.కొనవలస చెక్‌పోస్టు నుంచి సాలూరు వెళ్లే జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపుల వద్ద సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చెక్‌పోస్ట్, కొనవలస దాటిన తర్వాత ఉన్న సూచికలకు పిచ్చిమొక్కలు అల్లేయడంతో కనిపించడం లేదు. పణుకువలస దాటిన తర్వాత పెద్ద మలుపు వద్ద సూచికలే లేవు. అధికారులు స్పందించి సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈ మలుపులు ప్రమాదకరం


