అన్నమయ్య: రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాజంపేట తహసీల్దార్ దస్తగిరయ్య తెలిపారు. భూ సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంబంధిత పత్రాలతో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు భూ సమస్యల పరిష్కార వేదిక


