E.G: రుచిలో రారాజుగా పేరొందిన పులస చేపకు శుక్రవారం యానాం రేవులో భారీ ధర పలికింది. మత్స్యకార మహిళ పార్వతి రెండు పులస చేపలను రూ. 24వేలు, రూ.7,500 చొప్పున వేలంలో దక్కించున్నారు. 1.300 కేజీల బరువున్న మగ పులసకు ఇంత ధర పలకడం ఈ ఏడాది ఇదే తొలిసారని మత్స్యకారులు తెలిపారు. వాతావరణ మార్పులతో గోదావరి జిల్లాల్లో ఈ సీజన్‌లో పులస చేపలు ఒకటీఅరా తప్ప దొరకడంలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులసకు భలే డిమాండ్..!


