హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోనెగండ్లలో గృహహింసతో వివాహిత మృతి

KRNL: గోనెగండ్ల మండలం ఒంటెద్దిన్నెలో విషాదం చోటుచేసుకుంది. ఆదోని మండలం పార్వతీపురానికి చెందిన కురువ మహేశ్వరి శుక్రవారం మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఏడాది నుంచి వేధింపులు ఉన్నాయని, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.