PLD: ఈపూరు(M) ఊడిజెర్లలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏడుగురు డెంగీ బారిన పడగా, తాజాగా మరో ముగ్గురిలో లక్షణాలు కనిపించాయి. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి, గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. మురుగు కాలువలను శుభ్రపరిచి ఎబెట్ మందు పిచికారీ చేశారు. డెంగీ అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఊడిజెర్లలో పెరుగుతున్న డెంగీ కేసులు


