హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నాడీ సంబంధిత వ్యాధులను పసిగట్టే నయా టెక్నాలజీ

పార్కిన్సన్స్, ALS వంటి నాడీ మండల క్షీణత వ్యాధులను ముందే పసిగట్టే నానోపోర్ ఆధారిత సెన్సర్లను BRIC-RGCB పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న సెన్సర్లు ఆయా వ్యాధులకు సంబంధించిన బయోమార్కర్లను కచ్చితంగా గుర్తిస్తాయి. భవిష్యత్తులో వీటి సాయంతో రక్తం, ఇతర జీవ ద్రవాల ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సైతం అత్యంత ముందుగానే పసిగట్టవచ్చని పరిశోధకులు వెల్లడించారు.