హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

20-20-20.. కళ్లను సేవ్ చేసే రూల్!

కంటి చూపును కాపాడుకునేందుకు '20-20-20' రూల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ కంప్యూటర్లు, మొబైల్స్ చూసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి కళ్లు పక్కకు తిప్పి, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఈ సాధారణ పద్ధతి ద్వారా కంటి కండరాలు విశ్రాంతి పొంది, డిజిటల్ కంటి ఒత్తిడి, పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు.