SKLM: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు నందిగాం, సాయంత్రం 4.30 గంటలకు సంతబొమ్మాళి మండలాల ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి తెలపవచ్చన్నారు.
వార్తలు
నేడు నిమ్మాడలో ప్రజా దర్బార్


