SKLM: మందస మండలం లొహరిబంద గ్రామంలో కుక్కలు, బెడద పెరిగింది. శనివారం ఉదయం పిన్నింటి జోగారావుకు చెందిన ఆవుదూడపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. కోళ్లు, మేకలు, గేదెదూడలు, ఆవుదూడలపై తరచూ దాడులు జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మనుషులపై కూడా దాడులు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల దాడిలో దూడ మృతి!


