హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారంచేడు ఎంఈవోగా గంగాధర్‌రావు నియామకం

BPT: కారంచేడు మండల విద్యాశాఖ అధికారి (MEO)గా గంగాధర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.