హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస పోలీసుస్టేషన్ పరిధి చీపురువలస గ్రామంలో శుక్రవారం రాత్రి సీఐ విజయకుమార్ పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని సూచించారు. ఎవరైనా గంజాయి సేవించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.