హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్

కృష్ణా: పండగల రద్దీ నేపథ్యంలో మచిలీపట్నం–కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ మధ్య ప్రత్యేక రైలును రైల్వే శాఖ ప్రకటించింది. ఆగస్టు 30న రైలు నం. 07217 మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు శివమొగ్గ టౌన్ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు.