గుంటూరులో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్య కుట్ర కేసులో ఏ-2 నిందితుడు వెంకటేశ్ శుక్రవారం మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో సరెండర్ కావడంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో ఏ-1 నిందితుడు నరేంద్ర ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాస్ హత్య కుట్ర కేసులో A-2 లొంగుబాటు


