హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ELR: ఈ నెల 30న ఏలూరులో నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 389 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 214 మంది, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్‌లో 175 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.