హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

WGL: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై మామునూరు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మామునూరు పరిధిలోని ఓ కాలనీకి చెందిన శ్రీరాం (22) తన మేనత్త కుమార్తెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం సన్నిహితంగా మెలిగాడు. పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.